- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ రాజధానిలో ఆరు రోజులు.. 100 కిలోమీటర్ల పాదయాత్ర
ఏపీ రాజధాని(Ap Capital)లో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఈనెల 13 నుండి 18 వరకు ఆరు రోజులు 100 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నట్లుగా రాజధాని అభివృద్ధి వేదిక నాయకులు ఎం. రవి, బి. లక్ష్మణరావు తెలిపారు....

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని(Ap Capital)లో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఈనెల 13 నుండి 18 వరకు ఆరు రోజులు 100 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నట్లుగా రాజధాని అభివృద్ధి వేదిక నాయకులు ఎం. రవి, బి. లక్ష్మణరావు తెలిపారు. ఉండవల్లి ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరపాలని, రాజధాని ఫలాలు ప్రజలందరికీ దక్కాలని కోరుతున్నామన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి అప్పు కాకుండా కేంద్ర ప్రభుత్వమే గ్రాంట్‌గా ఇవ్వాలని కోరారు. రాజధానిలోని ఇళ్ల స్థలాలు లేని పేదలకు మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలన్నారు. పెళ్లిళ్లయి భూమిలేని వారికి ఇతర షరతులు విధించకుండా రాజధాని సామాజిక పెన్షన్ శాంక్షన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోతున్న బాధితులకు ఆమోదయోగ్యమైన ప్యాకేజీ, కోరుకున్న చోట ఇంటి స్థలం కేటాయించాలని ఇంటి నిర్మాణం చేపట్టాలని రాజధాని అభివృద్ధి వేదిక నాయకులు ఎం. రవి, బి. లక్ష్మణరావు డిమాండ్ చేశారు.
అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజధాని గ్రామాల పారిశుధ్య కార్మికులు, గార్డెనింగ్ కార్మికులు, సెక్యూరిటీ గార్డ్స్, విట్, ఎస్‌ఆర్‌ఎమ్, అమృత యూనివర్సిటీలు, మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య లయంలో పని చేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలని, గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, మంచినీరు సక్రమంగా ఇవ్వాలని రాజధాని అభివృద్ధి వేదిక నాయకులు ఎం. రవి, బి. లక్ష్మణరావు డిమాండ్ చేశారు.






