గ్లోబల్ హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసు.. ఆరుగురు అరెస్ట్

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో సంచలనం రేపిన మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.

గ్లోబల్ హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసు.. ఆరుగురు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం రేపిన మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిని శనివారం సాయంత్రం మదనపల్లె డీఎస్పీ మహేంద్ర.. మీడియా ముందు ప్రవేశపెట్టారు. గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో ఇప్పటికి ఆరుగురిని అరెస్ట్ చేశామని, మరో 8 మంది నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. వారిని పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని.. గోవా, కర్ణాటక, తెలంగాణలో తనిఖీలు చేస్తున్నామని వివరించారు.

నవంబర్ 9వ తేదీన గ్లోబల్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ లో బెంగళూరుకు చెందిన డాక్టర్, ఆయన టీమ్ కలిసి చట్ట వ్యతిరేకంగా వైజాగ్ కు చెందిన ఇద్దరు మహిళలకు కిడ్నీ మార్పిడి చికిత్స నిర్వహించగా.. యమున అనే మహిళ మరణించిందని స్పష్టం చేశారు. ఆమె తల్లి సూరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మదనపల్లె పోలీసులు.. డాక్టర్ కంప ఆంజనేయులు, బాలరంగడు, మెహరాజ్, పిల్లి, పద్మ, సత్య, సూరిబాబులను అరెస్ట్ చేసి, వారి నుంచి ఆరు మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నీ రాకెట్లో ఎంతమంది హస్తం ఉంది? ఇప్పటి వరకూ ఎన్ని కిడ్నీ మార్పిడులు చేశారు? అన్న కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతున్నట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు.

Next Story