AP News : ఒంటిమిట్టలో రేపు సీతారాముల కల్యాణోత్సవం

by Muthe.Rajitha |

ఏపీ(AP)లోని ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవం(Ontimitta Seetharama Kalyanotsavam) రేపు అంగరంగ వైభవంగా జరగనుంది.

AP News : ఒంటిమిట్టలో రేపు సీతారాముల కల్యాణోత్సవం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లోని ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవం(Ontimitta Seetharama Kalyanotsavam) రేపు అంగరంగ వైభవంగా జరగనుంది. స్వామివారి కల్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా జరుపుతామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) పేర్కొన్నారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కల్యాణోత్సవ వివరాలు ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఒంటిమిట్ట సీతారాముల వారి కళ్యాణోత్సవం జరపనున్నామని, ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ప్రకటించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు.

కళ్యాణం అనంతరం భక్తులకు ముత్యాల తలంబ్రాలు, లడ్డూ ప్రసాదం ఇస్తామని వెల్లడించారు. ఇప్పటికే తలంబ్రాల ప్యాకెట్లు, లడ్డూ ప్రసాదం సిద్ధంగా ఉంచామని తెలియజేశారు. అదేవిధంగా కళ్యాణోత్సవం తిలకించడానికి వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ అందిస్తామని అన్నారు. భక్తులంతా స్వామి వారి కళ్యాణంలో భాగం కావాలని బీఆర్ నాయుడు పిలుపునిచ్చారు.

Next Story