- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: సిట్ కస్టడీలోకి సజ్జల.. లిక్కర్ కేసులో ప్రశ్నల వర్షం
ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు పెంచింది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కాం కేసు(Ap Liquor Scam Case)లో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపిన అధికారులు.. కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. ఇందులో భాగంగా జైలు ఉన్న నిందితులను ఒక్కక్కరిగా కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కీలక సమాచారం కోసం ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. తాజాగా సజ్జల శ్రీధర్ రెడ్డి(Sajjala Sridhar Reddy)ని సిట్ అధికారులు(SIT Officials) కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మేరకు సాయంత్రం వరకూ ఆయన్ను ప్రశ్నించనున్నారు. లిక్కర్ స్కాం కేసులో ప్రధాన సూత్రదారి ఎవరు అనే కోణంలో సజ్జలను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మద్యం క్రయ, విక్రయాలపై కీలక విషయాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే కేసులో రాజ్ కసిరెడ్డితో పాటు చాణక్యను ఇప్పటికే అధికారులు ప్రశ్నించారు. వీరి ఇచ్చిన సమాచారంతో సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీకి తీసుకున్నట్లు తెలుస్తోంది.






