- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీ మిథున్‌రెడ్డికి మళ్లీ షాకిచ్చిన సిట్.. ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు
by Kema Shiva Kumar |
వైసీపీ కీలక నేత, ఎంపీ మిథున్‌రెడ్డి (Mithun Reddy)కి సిట్ అధికారులు మళ్లీ షాకిచ్చారు.

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, ఎంపీ మిథున్‌రెడ్డి (Mithun Reddy)కి సిట్ అధికారులు మళ్లీ షాకిచ్చారు. ఇవాళ హైదరాబాద్, తిరుపతి, బెంగళూరులోని ఆయన నివాసాల్లో తనిఖీలు ఆకస్మికంగా తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని ప్రశాసన్ నగర్, యూసుఫ్‌గూడ గాయత్రీ హిల్స్‌లోని మిథున్‌రెడ్డి నివాసాల్లో రెయిడ్స్ నిర్వహించారు. కొండాపూర్‌లోని ఆయన కార్యాలయం, సోమాజిగూడలోని డికాట్ కొరియర్ కంపెనీలోనూ తనిఖీలు జరిగాయి. అయితే, డికాట్ కొరియర్ (Dicott Courier) నుంచి మిథున్ రెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ (PLR) ప్రాజెక్స్ కంపెనీలోకి రూ.25 కోట్లు వచ్చినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా సిట్ బృందం ఈ సోదాలు చేపడుతోంది..
Next Story






