అదంతా కట్టు కథే: ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ పోలీసులు విచారించారు..

అదంతా కట్టు కథే: ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు(AP Liquor Scam Case)లో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి(Rajampet MP Mithun Reddy)కి విచారణ ముగిసింది. ఈ కేసులో ఆయనపై ఆరోపణలు ఎందుర్కొంటున్నారు. దీంతో ఆయనను సిట్ అధికారులు 8 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో తాము ఇప్పుడేం మాట్లాడలేమని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ కోర్టులో ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతపై తమపై చాలా ఆరోపణలు చేశారని, అవన్నీ ఉట్టి కట్టు కథలేనని కొట్టిపారేశారు. తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. డ్రగ్స్, ట్రాఫికింగ్ తప్ప అన్ని కేసులు పెట్టారని మిథున్ రెడ్డి ఆరోపించారు. మదనపల్లి ఫైల్స్ దగ్థం కేసులో తమను ఇరికించే ప్రయత్నం చేశారని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు.

Next Story