- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. విజయవాడ ఏసీబీ కోర్టుకు గోవిందప్ప
వైసీపీ (YCP) హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ (Liquor Scam)లో రూ.వేల కోట్ల కమీషన్లను సేకరించి వాటిని షెల్ కంపెనీ (Shell Company)లకు మళ్లించిన భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ (YCP) హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ (Liquor Scam)లో రూ.వేల కోట్ల కమీషన్లను సేకరించి వాటిని షెల్ కంపెనీ (Shell Company)లకు మళ్లించిన భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. కేసులో A33గా ఉన్న ఆయన మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు. జగన్ సతీమణి వైఎస్ భారతి ఆర్థిక లావాదేవీలు ఆయన పర్యవేక్షిస్తారు. అయితే, నెల రోజులుగా పరారీలో గోవిందప్ప బాలాజీని కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని చామరాజనగర జిల్లా బీఆర్‌హిల్స్ అటవీ ప్రాంతంలోని ఎరకనగడ్డె కాలనీలో సిట్ అధికారులు పక్కా ప్లాన్ వేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ట్రాన్సిట్ వారంట్ కోసం గోవిందప్పను ఎలందూరు కోర్టులో హాజరుపరిచి ఇవాళ విజయవాడకు తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను సిట్ అధికారులు నేరుగా ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.






