- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. చెవిరెడ్డి ఇన్‌ఫ్రా కంపెనీల్లో సోదాలు
రాష్ట్ర లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర లిక్కర్ కేసు(Liquor Case)లో సిట్ అధికారులు దూకుడు పెంచారు. వైసీపీ నేత చెవిరెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి(Ycp Leader Chevireddy Bhaskar Reddy), ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి(Mohith Reddy)కి చెందిన ఇన్ ఫ్రా కంపెనీ(Infra Companay)ల్లో సోదాలు నిర్వహించారు. అధికారులు చిత్తూరు(Chittoor) వెళ్లి ఆయా కంపెనీల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. మద్యం ముడుపులను కంపెనీల్లోకి మళ్లించినట్లుగా అధికారులకు సమాచారం అందడంతో ఈ సోదాలు చేపట్టారు. దీంతో ఆయా కంపెనీల్లో అధికారుల తనిఖీలు ఒక్కసారిగా కలకలం రేపాయి. సమాచారం తెలుసుకున్న చిత్తూరు వైసీపీ శ్రేణులు ఆయా కంపెనీల వద్దకు భారీగా చేరుకుంటున్నారు. సిట్ చర్యలను వ్యతిరేకిస్తున్నారు. సిట్ ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. సోదాల తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.






