- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap Liquor Case: సిట్ దూకుడు.. హైదరాబాద్‌లో ఐదు చోట్ల తనిఖీలు
ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ కేసు(AP Liquor Case)లో సిట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్(Hyderabad)లో 5 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఏ-32 నిందితుడు కృష్ణమోహన్‌రెడ్డి(A-32 accused Krishnamohan Reddy) కుమారుడు రోహిత్(Rohit) డైరెక్టర్‌గా ఉన్న కంపెనీల్లో సోదాలు చేస్తున్నారు. నాటికల్, ఐబాట్, స్కూబీ ల్యాబ్స్, క్రిస్టల్ ఏక్యూ స్క్వేర్(Nautical, iBot, Scooby Labs, Crystal AQ Square) కంపెనీల్లో తనిఖీలు చేస్తున్నారు.
ఇక ఇదే కేసులో మరికొందరికి త్వరలో నోటీసులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం సిట్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. దీంతో మిగిలిన నిందుతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే పలువురు నిందితుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. కొంతమంది నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. గత ప్రభుత్వంలో మద్యం ప్రభుత్వమే విక్రయించింది. అయితే మద్యం విక్రయాలు, కొనుగోళ్ల వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు సిట్ గుర్తించింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టింది. దీంతో నిందితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.






