మద్యం కేసు నిందితులకు బిగ్ షాక్.. కార్యాలయాలు, రెస్టారెంట్లలో సిట్ సోదాలు

by Vemula.Srinu Prasad |

మద్యం స్కామ్ కేసు నిందితులను సిట్ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు....

మద్యం కేసు నిందితులకు బిగ్ షాక్.. కార్యాలయాలు, రెస్టారెంట్లలో సిట్ సోదాలు
X

దిశ, వెబ్ డెస్క్: మద్యం స్కామ్ కేసు(Liquor scam case) నిందితులను సిట్ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. వారి కార్యాలయాలు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో నిందితులు రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy), బాలాజీ గోవిందప్ప(Balaji Govindappa), చాణక్య(Chanikya)ను పోలీసులు అరెస్ట్ చేసిన జైలుకు పంపారు. అయితే స్కామ్‌కు ముందు వీరు ఎన్ని సార్లు భేటీ అయ్యారనే అంశంపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాజ్ కసిరెడ్డికి చెందిన కార్యాలయంతో పాటు బాలాజీ గోవిందప్ప పని చేసిన భారతి సిమెంట్స్ కార్యాలయం, చాణక్యకు చెందిన గ్రిల్ రెస్టారెంట్‌లో సోదాలు నిర్వహించారు. పలు సాంకేతిక ఆధారాలతో ఈ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. పలు రికార్డులను కూడా పరిశీలించారు. తదుపరి చర్యలపై ఉత్కంఠ రేగుతోంది.

ఇప్పటికే ఈ కేసులో సిట్ అధికారుల వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(YSRCP MP Mithun Reddy)ని సైతం జైలుకు పంపారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు.. ఇప్పటికే పలువురు నిందితులను సైతం అరెస్ట్ చేశారు. తాజాగా మరికొందరి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు చేసిన ఈ సోదాలు ప్రస్తుతంగా సంచలనంగా మారాయి.

Next Story