లిక్కర్ స్కాం కేసు.. మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత మోహిత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది.

లిక్కర్ స్కాం కేసు.. మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఏపీలో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత మోహిత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి తాజాగా సిట్ నోటీసులు ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో ఎల్లుండి(బుధవారం) సిట్ విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఇటీవలే ఈ కేసులో ఆయనను సిట్ ఏ39గా చేర్చింది. మద్యం కుంభకోణంలో వచ్చిన నగదును ఇటీవలి ఎన్నికల్లో ఖర్చుపెట్టినట్లు సిట్ గుర్తించింది. ఇదే కేసులో అరెస్టైన మోహిత్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

Next Story