ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. చెవిరెడ్డికి సిట్ నోటీసులు

by Naga Rani Yarlagadda |

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. చెవిరెడ్డికి సిట్ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy), ఆయన పీఏ బాలాజీ కుమార్ యాదవ్ కు సిట్ నోటీసులు (SIT Notice) జారీ చేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట వద్ద టోల్ గేట్ సమీపంలో రూ.8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఘటనపై వివరణ ఇవ్వాలని కోరింది. అలాగే ఇండోర్‌లో బాలాజీ అరెస్ట్ సమయంలో తాము సీజ్ చేసిన రూ.3.50 లక్షల సొమ్ము లిక్కర్ స్కామ్ దేనని భావిస్తున్నామని, దీనిపై సమాచారమివ్వాలని కోరారు.

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో తాజాగా అరెస్టైన ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అరెస్టుకు ముందు మిథున్ రెడ్డి.. సిట్ విచారణలో మాజీ సీఎం జగన్ పేరును పదే పదే ప్రస్తావించినట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో.. లిక్కర్ స్కామ్‌లో ఇంకా ఎవరెవరి హస్తం ఉందోనని రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది.

Next Story