- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏడుగురు టీటీడీ ఉద్యోగులకు బిగ్ షాక్... కల్తీ నెయ్యి కేసులో సిట్ మెమో దాఖలు
కల్తీ నెయ్యి కేసులో ఏడుగురు టీటీడీ ఉద్యోగులకు సిట్ మెమో దాఖలు చేసింది...

దిశ, వెబ్ డెస్క్: ఏడుగురు టీటీడీ(TTD) ఉద్యోగులకు సిట్ బిగ్ షాక్ ఇచ్చింది. కల్తీ నెయ్యి కేసు(Adulterated ghee case)లో నిందితులిగా చేర్చింది. అంతేకాదు మెమో సైతం దాఖలు చేసింది. 2019-24 మధ్య టీటీడీ కొనుగోలు విభాగంలో పని చేశారు. మాజీ జీఎంలు జగదీశ్వర్ రెడ్డి, మురళీకృష్ణతో పాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లపై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. అసలు ఈ కల్తీ నెయ్యిపై ఫిర్యాదు చేసిన మురళీకృష్ణను సైతం నిందితుడిగా తేల్చారు. కల్తీ నెయ్యి అక్రమాలపై 2024 అక్టోబర్‌లో మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. విచారణలో మురళీకృష్ణ కూడా అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయనను నిందితుడిగా చేర్చారు.
మరోవైపు ఎస్వీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని కూడా నిందితుడిగా సిట్ గుర్తించింది. ఈ మేరకు ఆయనపైనా కేసు నమోదు చేసింది. ఏ28గా మాజీ సీఎం జగదీశ్వర్ రెడ్డి, ఏ29గా మాజీ జీఎం శ్రీనివాస వెంకటరామ సుబ్రహ్మణ్యం, ఏ30గా మాజీ జీఎం మురళీకృష్ణ, ఏ31గా ఎస్వీ గోశాల మాజీ డైరెక్టర్ కె. హరినాథ్ రెడ్డిని చేర్చి మెమో దాఖలు చేసింది.






