Raj Kasireddy: ఈ రోజు మరింత లోతుగా..?

by Vemula.Srinu Prasad |

ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరింత లోతుగా ఈ రోజు సిట్ విచారణ ఉండబోతోంది..

Raj Kasireddy: ఈ రోజు మరింత లోతుగా..?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కాం కేసు(AP Liquor Scam Case)లో సిట్ అధికారులు దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఈ కేసు ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy) ఇప్పటికే అరెస్ట్ అయి జైలు(Jail)లో ఉన్నారు. అయితే కసిరెడ్డిని శుక్రవారం కస్టడీ(Custody)కి తీసుకుని విచారించారు. సాయంత్రానికి తిరిగి జైలుకు తరలించారు. తాజాగా ఈ కస్టడీ రెండో రోజుకు చేరుకుంది. దీంతో సిట్ అధికారులు(Sit Offices) మరికాసేపట్లో కసిరెడ్డిని కస్టడీకి తీసుకోనున్నారు. లిక్కర్ స్కాంకు సంబంధించి శుక్రవారం కసిరెడ్డికి ప్రశ్నల వర్షం కురిపించారు. తొలిరోజు కస్టడీ ముగియడంతో తిరిగి జైలుకు తరలించారు.

ఈ రోజు సైతం ఆయన్ను అధికారులు ప్రశ్నించారు. ఇందుకోసం జైలు నుంచి సిట్ కార్యాయానికి తీసుకున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు మరికాసేపట్లో కసిరెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించనున్నారు. శుక్రవారం కస్టడీలో కసిరెడ్డి పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రోజు మాత్రం అధికారులు మరింతగా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. అసలు లిక్కర్ స్కాంకు బీజం వేసెందెవరు..?.. ఎవరెవరు ఉన్నారు. ఎలాంటి సంబంధాలున్నాయి. ఎంత నగదు లావాదేవీలు జరిగాయి. మొత్తం ఎంత మద్యం సేల్ అయింది..?. మిగిలిన నిందితులెవరు..?. మరో నిందితుడు విజయసాయిరెడ్డి చెప్పినదంతా నిజమేనా?.’’ అనే ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

Next Story