Ap News: ఎంపీ మిథున్ రెడ్డికి ముగిసిన కస్టడీ

by Vemula.Srinu Prasad |

లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ కస్టడీ ముగిసింది...

Ap News: ఎంపీ మిథున్ రెడ్డికి ముగిసిన కస్టడీ
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(Liquor Case)లో ఎంపీ మిథున్ రెడ్డి(Mp Mithun Reddy)కి సిట్ కస్టడీ(SIT Custody) ముగిసింది. ఈ కేసులో మరింతగా విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్న సిట్ అధికారులు.. మిథున్‌రెడ్డిని రెండు రోజుల పాటు విచారించారు. ఈ రోజు కస్టడీ ముగియడంతో మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సిట్ కస్టడీలో లిక్కర్ కేసుకు సంబంధించి పలు కీలక ప్రశ్నలు సంధించారు. సిట్ అధికారులు దాదాపు 50 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే మిథున్ రెడ్డి దాటవేసినట్లు సమాచారం. ప్రముఖంగా రూ. 5 కోట్లు మద్యం ముడపులు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యుల ఖాతాలకు చేరడంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పలేదని సమాచారం.

Next Story