- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Chandrababu:ముగిసిన ఎస్ఐపీబీ సమావేశం.. కీలక అంశాలకు ఆమోదం
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో ఈ రోజు(గురువారం) ఎస్ఐపీబీ సమావేశం జరుగుతోంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో ఈ రోజు(గురువారం) ఎస్ఐపీబీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్, మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్(Minister Durgesh), వాసంశెట్టి సుభాష్(Vasamsetti Subhash), సీఎస్ కె.విజయానంద్(CS Vijayanand), ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సమావేశంలో 19 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.33 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే.. 35 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులకు SIPB ఆమోదం తెలిపారు. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఈ పెట్టుబడులపై సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 76 ప్రాజెక్టుల ద్వారా రూ.4.96 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపినట్లు సీఎం చెప్పారు. వీటి ద్వారా 4.5లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.






