- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైయస్ జగన్ ను కలిసిన సింగయ్య కుటుంబం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డిని చీలి సింగయ్య కుటుంబ సభ్యులు కలిశారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డిని చీలి సింగయ్య కుటుంబ సభ్యులు కలిశారు. కాసేపటి క్రితమే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి... చీలి సింగయ్య భార్య లూర్ధు మేరి, కుమారులు అలాగే కుటుంబ సభ్యులు వచ్చారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డిని కలిసి వాళ్ళ బాధలను చెప్పుకున్నారు. అటు సింగయ్య కుటుంబాన్ని పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి.
ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జరిగిన కారు ప్రమాదంలో సింగయ్య ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సింగయ్య కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అందజేశారు.
ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తో పాటు పలువురు వైసీపీ నేతలపై కూడా ఈ సంఘటన నేపథ్యంలో కేసు నమోదయింది. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ డ్రైవర్ కూడా అరెస్ట్ అయ్యాడు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే సింగయ్య కుటుంబం వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలవడం... హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియో వైరల్ గా మారింది.






