సింగయ్య మృతి కేసు.. జగన్‌ క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

by Kema Shiva Kumar |

పల్నాడు (Palnadu) జిల్లా పర్యటనలో భాగంగా రెంటపాళ్ల (Rentapalla) గ్రామంలో సింగయ్య మృతికి కారణం మాజీ సీఎం వైఎస్ జగన్‌ (YS Jagan) అంటూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

సింగయ్య మృతి కేసు.. జగన్‌ క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: పల్నాడు (Palnadu) జిల్లా పర్యటనలో భాగంగా రెంటపాళ్ల (Rentapalla) గ్రామంలో సింగయ్య మృతికి కారణం మాజీ సీఎం వైఎస్ జగన్‌ (YS Jagan) అంటూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court)లో లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition) దాఖలు చేయగా విచారణను నేటి వాయిదా వేశారు. ఈ మేరకు ఇవాళ మరోసారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో నిందితులపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేస్తున్నట్లుగా న్యాయమూర్తి వెల్లడించారు.

కాగా, ఇదే కేసులో జగన్‌తో పాటు కారు డ్రైవర్‌ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్‌ రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిని నిందితులుగా చేర్చారు. దీంతో వారు కూడా హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. అన్ని పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ చేపడుతోంది. జగన్‌ వాహనం కింద సింగయ్య (Singaiah) పడినట్లుగా వీడియో క్లియర్ ఫుటేజ్ లభ్యమైందని గుంటూరు ఎస్పీ సతీష్‌ కుమార్‌ (SP Sathish Kumar) వెల్లడించిన విషయం తెలిసిందే. సీసీ టీవీ ఫుటేజ్‌, డ్రోన్‌ దృశ్యాలు, ఘటనా స్థలంలో ఉన్న వారు తీసిన వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాకే వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసినట్లుగా ఎస్పీ స్పష్టం చేశారు.

Next Story