- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన సింగపూర్ పర్యటన.. APకి పయనమైన సీఎం చంద్రబాబు టీమ్
ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) బృందం సింగపూర్ (Singapore) పర్యటన నేటితో ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) బృందం సింగపూర్ (Singapore) పర్యటన నేటితో ముగిసింది. ఈ సందర్భంగా తిరిగి ఏపీకి పయనమైన వారికి ప్రవాసాంధ్రులు ఘనంగా సెండాఫ్ ఇచ్చారు. నాలుగు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించిన చంద్రబాబు బృందం మొత్తం 26 సమావేశాల్లో వివిధ రంగాల్లోని కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని ఆయా సంస్థలను అభ్యర్థించారు. తమ రాష్ట్రంలో పెట్టుడబడులు పెడితే.. అందుకు అవసరమైన అన్ని వసతులు, సౌకర్యాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. ఈ అర్ధరాత్రి సీఎం చంద్రబాబు టీమ్ హైదరాబాద్ మీదుగా అమరావతికి చేరుకోనున్నారు.
అయితే, నాలుగో రోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమ్‌సెక్ హోల్డింగ్స్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. డిజిటల్ టౌన్‌షిప్స్, ఇండస్ట్రియల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ డెలిగేట్స్ సంజీవ్ దాస్ గుప్తా, గౌరిశంకర్ నాగభూషణంలతో మాట్లాడారు. రాజధాని అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని వారికి సీఎం చంద్రబాబు వివరించారు.
అదేవిధంగా వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయో డైవర్సిటీ కాంప్లెక్స్‌లు, వైల్డ్ లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ జోన్ల ఏర్పాటు వంటి అంశాలపై మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ ప్రతినిధి మైక్ బార్క్ లేతో సీఎం చంద్రబాబు డిస్కస్ చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బార్క్ లే ఓకే చెప్పారు. పరిశ్రమలు, మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగరాభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై జపాన్‌కు చెందిన సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్‌తో సీఎం టీమ్ భేటీ అయింది. వివిధ ప్రాజెక్టుల్లో అవసరమైన ఫైనాన్షియల్ పార్ట్‌నర్‌షిప్‌పై ప్రధానంగా చర్చించారు.






