పవన్ కళ్యాణ్‌తో సెల్ఫీ తీసుకున్న సింగపూర్ హైకమిషనర్!

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-23 11:14:11  IST  )

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan)తో ఈరోజు(గురువారం) ఉదయం సింగపూర్(Singapore) కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్, కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్(Vaishnavi Vasudevan) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

పవన్ కళ్యాణ్‌తో సెల్ఫీ తీసుకున్న సింగపూర్ హైకమిషనర్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan)తో ఈరోజు(గురువారం) ఉదయం సింగపూర్(Singapore) కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్, కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్(Vaishnavi Vasudevan) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉదయం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలపై, ప్రజల సహకారం, సంయుక్త అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో వెల్లడించారు.

ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్(High Commissioner Simon Wong) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీ దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘‘విజయవాడలో పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా స్వాగతించినందుకు ధన్యవాదాలు. సింగపూర్-ఆంధ్రప్రదేశ్ చిరకాల స్నేహాన్ని కలిగి ఉన్నాయి. ఏపీ-సింగపూర్ సహకారాన్ని బలోపేతం చేయడం పై జరిగిన చర్చను అభినందించాల్సిందే‘’ ట్వీట్ చేశారు.

Next Story