- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింహాచలం ఘటన.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కీలక ఆదేశాలు జారీ
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది

దిశ,వెబ్‌డెస్క్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan), పలువురు మంత్రులు స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటన పై తాజాగా ఏపీ(Andhra Pradesh) దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారయణ రెడ్డి(Minister Anam Ramanarayana Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆనం రామనారయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
నిన్న(మంగళవారం) కురిసిన భారీ వర్షానికి సింహాచలం ఆలయంలో గోడ కూలింది. గోడకూలి ఏడుగురు భక్తులు(Devotees) ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరం, విచారకరం అన్నారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆనం ఆదేశించారు. ఈ ఘటన పై తక్షణమే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం(AP Government) అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ ప్రాంతంలో బలమైన రక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం రామనారయణ రెడ్డి పేర్కొన్నారు.






