- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : సింహాచలం దుర్ఘటన.. బాధ్యులపై వేటు వేసిన ప్రభుత్వం
ఇటీవల చందనోత్సవం రోజున ఏపీ(AP)లోని సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన విషయం(Simhachalam Temple Incident) తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల చందనోత్సవం రోజున ఏపీ(AP)లోని సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన విషయం(Simhachalam Temple Incident) తెలిసిందే. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం.. ప్రమాదంపై విచారణ కమిషన్(Enquiry Commission) ను ఏర్పాటు చేసింది. కాగా కమిషన్ నేడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంది ఏపీ సర్కార్. కమిటీ నివేదిక మేరకు దేవాదాయ, పర్యాటక శాఖకు చెందిన ఏడుగురు అధికారులను సస్పెండ్(Officers Suspension) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో సింహాచల ఆలయ ఈవో సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఈ మూర్తి, జేఈ బాబ్జీ, ఏపీటీడీసీ ఈఈ రమణ, డిప్యూటీ ఈఈ స్వామి, ఏఈ మదన్ మోహన్ ఉన్నారు. కాగా ఈ ఘటనకు ప్రధాన కారకుడైన కాంట్రాక్టర్ పై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది ప్రభుత్వం.
కమిటీ నివేదికలో ఏం చెప్పిందంటే..
తాత్కాలికంగా కట్టిన గోడకు పునాది లేకపోవడంతో భారీ వర్షం రావడంతో పెద్ద ఎత్తున నీరు, బురద చేరి గోడ కూలిందని తెలిపారు. సింహచలం అప్పన్న స్వామి చందనోత్సవానికి వారం ముందు హడావిడిగా ఈ గోడ నిర్మించారు. ప్రసాద్ పథకంలో భాగంగా గోడకు అనుమతి ఇచ్చారు. కానీ డిజైన్, పునాది లేకుండానే గోడ కట్టేశారు. విశాఖ సీపీ, సాక్షుల నుంచి తీసుకున్న వాంగ్ములం ప్రకారం.. ఆలయ ఈవో, ఇంజినీరింగ్ సిబ్బంది, పర్యాటక శాఖ అధికారులు గుత్తేదారులే బాధ్యులు అని కమిషన్ నివేదికలో పేర్కొంది. ఈ తరుణంలో నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.






