- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి మరో 5 రోజులు బిగ్ అలర్ట్... తీరం వెంబడి బీభత్సం...!
రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఒడిశా నుంచి ఏపీ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మిశ్రమ వాతావరణం నెలకొంటుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు వాతావరణం(Weather)లో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఒడిశా(Odisha) నుంచి ఏపీ(Ap) మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్(Gulf of Mannar) వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి(Surface trough) ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మిశ్రమ వాతావరణం నెలకొంటుందని విశాఖ వాతావరణ కేంద్రం(Visakha Weather Station) వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
వాతావరణం అస్థిరంగా మారనుండటంతో...
కోస్తా ఆంధ్ర ప్రాంతంలో వాతావరణం అస్థిరంగా మారనుండటంతో రాబోయే ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో సముద్ర తీరం వెంబడి గాలి వేగం పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గంటకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తద్వారా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ద్రోణి కారణంగా ఆకాశం మేఘావృతం
ప్రస్తుత ఉపరితల ద్రోణి కారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తమ కోతకు వచ్చిన పంటలను భద్రపరుచుకోవాలని అధికారులు సూచించారు.






