Show Cause Notices: రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు..!

by Kema Shiva Kumar |

విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియోకు సంబంధించిన భూములపై సర్కార్ ఫోకస్ పెట్టింది.

Show Cause Notices: రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియోకు సంబంధించిన భూములపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు స్టూడియో కోసం కేటాయించిన భూముల్లో లేఅవుట్లు చేయడం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో భూకేటాయింపును రద్దు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు లేఅవుట్ చేసిన 15.17 ఎకరాల భూమిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదో తెలియజేయాలని కోరుతూ షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ హరేంధీర ప్రసాద్‌కు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోదియా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ లేదా రేపు సురేష్ ప్రొడక్షన్స్‌కు షోకాజు నోటీసులు అందనున్నాయి. నోటీసులపై వారిచ్చే సమాధాన ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని కలెక్టర్ హరేంధీర ప్రసాద్‌ వెల్లడించారు.

Next Story