డ్రగ్స్, అమ్మాయి కోసమే బీభత్సం.. థార్ కార్ల వార్ కేసులో షాకింగ్ నిజాలు

by Vemula.Srinu Prasad |

విజయవాడ వంద అడుగుల రోడ్డులో థార్ జీపులతో నడిరోడ్డుపై సృష్టించిన హంగామా కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదకరమైన స్టంట్లు, కార్ల ఛేజింగ్‌ల వెనుక ప్రధాన కారణం డ్రగ్స్ మత్తు అని పోలీసులు తేల్చారు..

డ్రగ్స్, అమ్మాయి కోసమే బీభత్సం.. థార్ కార్ల వార్ కేసులో షాకింగ్ నిజాలు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ వంద అడుగుల రోడ్డులో థార్ జీపులతో నడిరోడ్డుపై సృష్టించిన హంగామా కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదకరమైన స్టంట్లు, కార్ల ఛేజింగ్‌ల వెనుక ప్రధాన కారణం డ్రగ్స్ మత్తు అని పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితుడు బొల్లా ఓంకార్‌కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో, అతను ఘటన సమయంలో డ్రగ్స్ సేవించి ఉన్నట్లు వైద్య నివేదికలు స్పష్టం చేశాయి. మత్తు తలకెక్కడంతోనే నిందితుడు నడిరోడ్డుపై అంతలా రెచ్చిపోయాడని పోలీసులు ధృవీకరించారు.

యువతి కోసమే వార్

ఈ హైడ్రామా అంతా కేవలం ఒక యువతి కోసమే జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరు యువకులు ఒకే అమ్మాయి కోసం పంతాలకు పోయి, రోడ్డుపై వెళ్లే వాహనదారుల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కార్లతో ఒకరినొకరు ఢీకొట్టుకుంటూ బీభత్సం సృష్టించారు. గొడవ జరుగుతున్న సమయంలో సదరు యువతి కూడా అక్కడే ఉన్న కారులో కూర్చుని ఉన్నట్లు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీల ద్వారా స్పష్టమైంది.

ఎవరనే కోణంలో దర్యాప్తు

ప్రస్తుతం నడిరోడ్డుపై ఇంతటి ఉత్కంఠకు కారణమైన ఆ మిస్టరీ యువతి ఎవరనే కోణంలో విజయవాడ పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా ఆమెను గుర్తించే పనిలో పడ్డారు. డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి జరిగింది, ఈ గొడవతో సంబంధం ఉన్న మిగిలిన వారు ఎవరు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ 'థార్' గ్యాంగ్ లీలలు ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారాయి.

థార్ వార్ వీడియో

Next Story