వైరల్ వీడియో వెనుక షాకింగ్ నిజం! ఏపీ ఫ్యాక్ట్ చెక్ సంచలన వివరాలు వెల్లడి

by Ramesh Naini |

నెల్లూరు జిల్లా సర్వేపల్లి, ముత్తుకూరు ప్రాంతాల్లో వైన్స్ షాపుల నుంచి బెల్ట్ షాపులకు పెద్ద ఎత్తున మద్యం అక్రమంగా తరలిస్తున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది.

వైరల్ వీడియో వెనుక షాకింగ్ నిజం! ఏపీ ఫ్యాక్ట్ చెక్ సంచలన వివరాలు వెల్లడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లా సర్వేపల్లి, ముత్తుకూరు ప్రాంతాల్లో వైన్స్ షాపుల నుంచి బెల్ట్ షాపులకు పెద్ద ఎత్తున మద్యం అక్రమంగా తరలిస్తున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది. ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు నిజం తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్రమ మద్యం తరలింపులు జరుగుతున్నాయన్న తప్పుడు అభియోగాలతో వీడియోను సృష్టించిన వారు, ఇందుకోసం అమాయకుడైన ఒక వృద్ధుడిని ఉపయోగించుకున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ మేరకు ఆదివారం ఏపీ ఫ్యాక్ట్ చెక్ FactCheck.AP.Gov.in ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అధికారికంగా వెల్లడించింది.

ట్వీట్ చేస్తూ.. ‘నెల్లూరు జిల్లా సర్వేపల్లి, ముత్తుకూరు లలో మద్యం బాటిళ్లను వైన్స్ షాపు ల నుంచి బెల్ట్ షాపులకు పెద్ద సంఖ్యలో అక్రమంగా తరలిస్తున్నారని కొందరు వ్యక్తులు కుట్ర పూరితంగా తయారు చేసిన వీడియో తో అక్రమ ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం అమాయకుడైన ఒక వృద్ధుడిని వాడుకున్నారు. సోషల్ మీడియాలో కుట్రపూరిత వీడియో వైరల్ కాగానే కంగారుతో అతని కుటుంబ సభ్యులు వాకబు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. క్వార్టర్ మద్యం ఎరగా చూపి ఇద్దరు వ్యక్తులు ఈ పని చేసినట్లు అధికారుల విచారణ లో కూడా వెల్లడి అయింది. మద్యం దుకాణాలలో ఎలాంటి అక్రమాలు జరగకపోయినా ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేయడం నేరం. సదరు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు. ఈ అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరుతున్నాం.’ అని ఏపీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. వీడియో ఇదే..

Next Story