- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో షాకింగ్ ఘటన.. సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డ్(వీడియో)
తిరుమల తిరుపతి దేవస్థానంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తిరుమలలో మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా అలిపిరి నడక మార్గంలోనూ, ఘాట్ రోడ్డులోనూ చిరుతలు కనిపిస్తుండడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ, అటవీ అధికారులు భద్రతా చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ ఎక్కడో ఓ చోట చిరుతలు సంచారిస్తుండడం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్నాయి. తాజాగా తిరుమలలో చిరుత పులి కలకలం సృష్టిస్తోంది. ఈస్ట్ బాలాజీ నగర్ బాల గంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచారిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన చిరుత దృశ్యాలు చూసిన అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ మేరకు భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.






