- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాన్స్‌జెండర్లకు అదిరిపోయే న్యూస్.. కూటమి సర్కార్ కీలక ప్రకటన
ట్రాన్స్‌జెండర్ల (Transgenders) విషయంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ట్రాన్స్‌జెండర్ల (Transgenders) విషయంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సమాజంలో ఎదుర్కొంటున్న వివక్షను దృష్టిలో పెట్టుకుని వారందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇచ్చేందుకు నిర్ణయం తీసున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సంస్థ చైర్మన్ తోట సుధీర్ (Thota Sudheer) వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలో అర్హులైన నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందుతాయని వెల్లడించారు. కాగా, ఇప్పటికే ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందించి ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నారు. పింఛన్‌తో పాటుగా ఇళ్ల స్థలాలను కూడా కేటాయిస్తున్నారు. వారి స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ సహకారంతో వారికి వివిధ రంగాల్లో ట్రైనింగ్ ఇచ్చి సొంత కాళ్లపై నిలబడేలా పలు పథకాలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని ట్రాన్స్‌జెండర్ల కోసం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కార్డులు కూడా మంజూరు చేశారు. ఈ క్రమంలోనే ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు కూడా అందించి వారికి అండగా నిలవాలని కూటమి సర్కార్ భావిస్తోంది.






