- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండగవేళ మందుబాబులకు షాకింగ్ న్యూస్
సంక్రాంతి పండగ నేపథ్యంలో మందుబాబులకు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి పండగ నేపథ్యంలో మందుబాబులకు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. మద్యం ధరలు పెంచుతూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయం మేరకు IMFL (ఇండియా మేడ్ ఫారిన్ లిక్కర్)తోపాటు ఫారిన్ లిక్కర్ బాటిళ్ల MRP పై రూ.10 పెంచారు. దాదాపు అన్ని సైజుల మద్యం బాటిళ్లపై ఈ పెంపు వర్తించనుండగా.. సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే రూ.99 ధర ఉన్న 180 మిల్లీలీటర్ల క్వార్టర్ బాటిళ్లకు మాత్రం మార్పు లేదు. అలాగే బీర్, వైన్, రెడీ టు డ్రింక్ ఉత్పత్తుల ధరలు కూడా యథాతథంగా ఉన్నాయి. మరోవైపు బార్లపై ఉన్న అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకం (ARET)ను ప్రభుత్వం రద్దు చేసింది.
దీని వల్ల వచ్చే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి మద్యం ధరలు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మార్పులతో ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ల వెలుపల 5 కి.మీ. పరిధిలో త్రీస్టార్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి హోటళ్లలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతిచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా సోమవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.






