డిప్యూటీ CM పవన్ కల్యాణ్ పర్యటనలో అపశృతి

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) చిత్తూరు జిల్లా పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది.

డిప్యూటీ CM పవన్ కల్యాణ్ పర్యటనలో అపశృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) చిత్తూరు జిల్లా పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ముసలి మడుగులో పర్యటన ముగించుకుని తిరిగి హెలిప్యాడ్‌కు వెళ్లే సమయంలో పవన్‌ని చూడడానికి ఒక్కసారిగా కాన్వాయ్ ముందుకు స్థానికులు దూసుకొచ్చారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. తోపులాట కిందపడిన ఓ మహిళ కాలిపై పవన్ వాహనం వెళ్లింది. గమన. గమనించిన సిబ్బంది వెంటనే మహిళను వెనక్కి లాగారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. కాగా, అంతకుముందు జిల్లాలో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించారు. పలమనేరు మండలం ముసలిమడుగులో 20 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి 4 కుంకీ ఏనుగులను తెచ్చినట్లు పవన్‌ కల్యాణ్‌కు అధికారులు తెలిపారు. వీటి ద్వారా జనావాసాలు, పొలాల్లోకి వచ్చే అడవి ఏనుగులను ఎలా కట్టడి చేస్తారో వివరించారు. కుంకీ ఏనుగుల విన్యాసాలను పవన్‌ కల్యాణ్‌ తిలకించారు. వాటికి ఆహారం తినిపించారు. తిరుగు ప్రయాణంలో అపశృతి చోటుచేసుకోవడం అందరినీ బాధించింది.

Next Story