పులిహోర పొట్లాల్లో మేకులు.. ప్రసాదం తింటుండగా భక్తుడు షాక్

by Gantepaka Srikanth |

పండుగపూట విజయవాడ(Vijayawada) కనకదుర్గమ్మ ఆలయం(Kanakadurgamma Temple)లో షాకింగ్ ఘటన చోటుచేసుకున్నది.

పులిహోర పొట్లాల్లో మేకులు.. ప్రసాదం తింటుండగా భక్తుడు షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: పండుగపూట విజయవాడ(Vijayawada) కనకదుర్గమ్మ ఆలయం(Kanakadurgamma Temple)లో షాకింగ్ ఘటన చోటుచేసుకున్నది. మహా మండపం కింద 4వ కౌంటర్‌లో ఓ భక్తుడు పులిహోర పొట్లాలు కొనుగోలు చేశాడు. ఆలయంలో మెట్ల మీద కూర్చొని తింటుండగా.. మేకులు దర్శనమిచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న భక్తుడు ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని నిలదీశారు. అపరిశుభ్రంగా అమ్మవారి ప్రసాదం తయారు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సాధారణ రోజుల్లో ఇబ్బందులు లేకున్నా.. వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలు, పండుగల సమయాల్లో ప్రసాదాలకు డిమాండ్‌ అధికంగా ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యతగా ఉండేలా చూసుకోవాలని హితవు పలికారు.

మరోవైపు స్పందించిన అధికారులు.. పారిశుద్ధ్యం, ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు నిపుణులైన అధికారులను నియమిస్తామన్నారు. 10 – 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ప్రసాద విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను పెంచుతామని చెప్పారు. ఇందుకోసం నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ సమగ్ర నివేదిక సమర్పిస్తామన్నారు.

Next Story