రాష్ట్రంలో ‘కుబేర’ టికెట్ రేట్లు పెంపు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-22 02:33:51  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’.

రాష్ట్రంలో ‘కుబేర’ టికెట్ రేట్లు పెంపు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
X

దిశ,వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’. ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కుర రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. కుబేర చిత్రం ఈ నెల(జూన్) 20వ తేదీన గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు భారీ కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద రాణిస్తుంది.

అయితే, ఇటీవల కుబేర సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మల్టిప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75 వరకు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఏపీలో కుబేర సినిమా టికెట్ల ధరలపై నిర్మాత సునీల్ నారంగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుబేర మూవీ సమయంలో పని విషయంలో కాస్త ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. సెన్సార్‌ విషయంలో టెన్షన్‌ పడ్డాను. దీనికి మించి వేరే టెన్షన్‌ ఏమీ లేదు అని చెప్పారు.

తాను సాధారణంగా టెన్షన్‌ ఇచ్చే టైపు కానీ ఈసారి తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ సమయంలో నాగార్జున (Nagarjuna) సాయం చేశారని సునీల్‌ నారంగ్‌ (Suniel Narang) చెప్పుకొచ్చారు. ఏపీలో కుబేర సినిమాకు టికెట్‌పై రూ.75 పెంచలేదని నిర్మాత సునీల్ నారంగ్ పేర్కొన్నారు. కొన్ని చోట్ల టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉన్నాయి. అందుకే రూ.25, రూ.50 మేర పెంచామని తెలిపారు. రూ.75 వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నాం.. కానీ అంత మొత్తంలో పెంచలేదు. తెలంగాణలోనూ టికెట్ రేట్లు రీజనబుల్‌గానే పెట్టాం అని ఆయన స్పష్టం చేశారు.

Next Story