- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో విశాఖ శారదా పీఠం మఠానికి షాక్.. ఖాళీ చేయాలని నోటీసులు జారీ
పవిత్ర పుణ్య క్షేత్రం అయిన తిరుమల తిరుపతిలో విశాఖ శారదా పీఠం వారు టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఓ భవనాన్ని నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: పవిత్ర పుణ్య క్షేత్రం అయిన తిరుమల తిరుపతి (Tirumala Tirupati) లో విశాఖ శారదా పీఠం (Visakhapatnam Sharada Peetham) వారు టీటీడీ నిబంధనల (TTD Rules) కు విరుద్ధంగా ఓ భవనాన్ని నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది.అయితే ఆ నిర్మాణాన్ని అక్రమ నిర్మాణంగా పరిగణించారు. ఈ అక్రమ నిర్మాణాలపై హిందూ ధర్మ పరిరక్షణ సమితి సంఘాలు (Hindu Dharma Protection Committee Associations) హై కోర్టు (High Court)కు వెళ్లాయి. అంతకుముందు, తిరుమల క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు తుమ్మల ఓంకార్ ఈ నిర్మాణం అక్రమమని, టీటీడీ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు టీటీడీ (TTD) కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది
దీంతో ఆ భవనాన్ని టీటీడీ ఈ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంది. కోర్టు విచారణ సందర్భంగా, టీటీడీ బోర్డు ఈ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు తీర్మానించింది. అక్రమ నిర్మాణాలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ నిర్మాణాలను కూల్చివేయాలని కోర్టు హెచ్చరించింది. ఈ తీర్పుతో తాజాగా విశాఖ శారదా పీఠం వారు నిర్మించిన మఠానికి ఈ రోజు టీటీడీ నోటీసులు (TTD Notices) ఇచ్చింది. 15 రోజుల్లోగా మఠం ఖాళీ చేసి వెళ్లిపోవాలని, అలాగే ఆ భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్ విభాగం (TTD Estate Department) ఈ నోటీసులు ఇచ్చింది.






