- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు
by Kema Shiva Kumar |
ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైసీపీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైసీపీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడం అంబటి రాంబాబు వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ మేరకు ఇవాళ ఆయనతో పాటు ఇతర వైసీపీ నేతలపై పట్టాభిపురం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. అంబటి పోలీసులను బెదిరించారని, తమ విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ BNS యాక్ట్ 132, 126(2), 351(3), 189(2), రెడ్ విత్ 190 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. అనుమతులు లేకుండా ప్రదర్శన నిర్వహించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారని పోలీసులు అందులో పేర్కొన్నారు.
Next Story






