షెల్ కంపెనీ ముద్ర వేస్తున్నారు...అసలు వాటి అర్థం తెలుసా? : వైసీపీని నిలదీసిన లోకేశ్

by Seetharam |   (  Updated:2023-09-17 11:34:16  IST  )

సీమెన్స్ ఆధ్వర్యంలో వందలాదిమంది భాగస్వాములుగా చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చాలా విజయవంతమైంది అని నారా లోకేశ్ అన్నారు.

షెల్ కంపెనీ ముద్ర వేస్తున్నారు...అసలు వాటి అర్థం తెలుసా? : వైసీపీని నిలదీసిన లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : సీమెన్స్ ఆధ్వర్యంలో వందలాదిమంది భాగస్వాములుగా చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చాలా విజయవంతమైంది అని నారా లోకేశ్ అన్నారు. ఈ ప్రాజెక్టులో అవినీతి అంటూ రెండున్నరేళ్లుగా ఒక్క ఆధారం లేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారు అని ట్విటర్ వేదికగా మండిపడ్డారు. షెల్ కంపెనీ ముద్ర వేస్తున్నారు...అసలు వాటి అర్థం తెలుసా? అని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలతో లక్షలాది కుటుంబాలను, శిక్షణ పొందిన విద్యార్థులను తీవ్రమైన క్షోభ పెడుతున్నారు అని లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోడీకి లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ లోకేశ్ ట్వీట్ చేశారు.

Next Story