YSR జిల్లా పేరు మార్చడంపై షర్మిల షాకింగ్ పోస్ట్

by velandi.Saikiran |   (  Updated:2025-05-26 12:10:37  IST  )

చంద్రబాబు ( Chandrababu) కూటమి ప్రభుత్వంపై వైయస్ షర్మిల ( Ys Sharmila) సీరియస్ అయ్యారు. వైయస్సార్ జిల్లా ( YSR

YSR జిల్లా పేరు మార్చడంపై షర్మిల షాకింగ్ పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు ( Chandrababu) కూటమి ప్రభుత్వంపై వైయస్ షర్మిల ( Ys Sharmila) సీరియస్ అయ్యారు. వైయస్సార్ జిల్లా ( YSR District)పేరు మార్చడం పై... షర్మిల మండిపడ్డారు. మహానాడులో వైయస్సార్ పేరు పలకాల్సి వస్తుందని.. ఒకరోజు ముందుగా జిల్లా పేరుని మార్చేసారని ఆగ్రహించారు. వ్యక్తిగతంగా ఇది బాధించే అంశం అంటూ ఎమోషనల్ అయ్యారు.

కడప జిల్లా చరిత్రను, సంప్రదాయాలను గౌరవిస్తూ వైయస్సార్ కడప జిల్లాగా పేరు మార్చడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. అయితే అదే సమయంలో సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చారు షర్మిల. విజయవాడ నగరానికి ఎన్టీఆర్ జిల్లాగా కాకుండా... ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా పేరు మార్చాలని కాంగ్రెస్ పార్టీ ( Congress party) తరఫున డిమాండ్ చేస్తున్నామని... షర్మిల పోస్ట్ పెట్టారు.

వైయస్సార్ జిల్లాను వైయస్సార్ కడప జిల్లాగా మార్చినప్పుడు... ఎన్టీఆర్ జిల్లాగా కాకుండా ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా మారిస్తే తప్పేం లేదని అడుగుతున్నామన్నారు. వైయస్సార్ అలాగే ఎన్టీఆర్ ఇద్దరు కూడా తెలుగుజాతి గర్వించే విధంగా.. పాలన కొనసాగించినట్లు స్పష్టం చేశారు. కాబట్టి ఇద్దరికి న్యాయం చేసే విధంగా ఉండాలని.. సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ఒకరికి ఒకలా, మరొకరి మరోలా రాజకీయాలు ఆపాదించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కాగా వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

Next Story