YS Sharmila : విశాఖ ఉక్కు ఆర్థిక ప్యాకేజీపై షర్మిల కీలక వ్యాఖ్యలు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-18 10:22:42  IST  )

విశాఖ ఉక్కు(Visakhapatnam Steel)ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక ప్యాకేజీ(Economic Package)పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల(AP Congress Chief YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila : విశాఖ ఉక్కు ఆర్థిక ప్యాకేజీపై షర్మిల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖ ఉక్కు(Visakhapatnam Steel)ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక ప్యాకేజీ(Economic Package)పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల(AP Congress Chief YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం రూ.11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చినంత మాత్రాన విశాఖ ఉక్కును ఉద్ధరించినట్లు కాదని షర్మిల వ్యాఖ్యానించారు. ప్యాకేజీతో ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని గౌరవించినట్లు అసలే కాదని...ఈ ప్యాకేజీతో ఒరిగేది ఏమీ లేదని పెదవి విరిచారు. ప్లాంట్ ఆర్థిక కష్టాలు గట్టెక్కలేదని... ఇది తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం ఎంత మాత్రం కాదని షర్మిల అభిప్రాయపడ్డారు.

విశాఖ స్టీల్ ను సెయిల్(SAIL)లో విలీనం(Merger) చేయడమే శాశ్వత పరిష్కారమని(Permanent Solution) స్పష్టం చేశారు. ప్లాంట్ కి సొంత గనులు కేటాయించడమే అసలైన పరిష్కారమని.. 20 మిలియన్ టన్నుల సామర్థ్యానికి ఫ్లాంటును విస్తరించిన నాడే ఉక్కు ఫ్యాక్టరీ సంకల్పం నెరవేరినట్లు లెక్క అని పేర్కొన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా రెండేళ్లలో విశాఖ ఉక్కును నెంబర్ వన్ గా నిలబెడతామనడం ఆంధ్రుల చెవుల్లో మరోసారి కేంద్రం పూలు పెట్టినట్లేనని షర్మిల విమర్శించారు.

Next Story