- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Sharmila : రోజాపై షర్మిల ఆగ్రహం
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా(Roja)పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా(Roja)పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నారు అంటూ రోజా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రోజా, వైసీపీ పార్టీ(YSRCP Party) తనకు అక్రమ సంబంధాలు అంటగట్టారని.. తన తోబుట్టినవాళ్లే తనపై విష ప్రచారం చేయించారని మండిపడ్డారు.తాను రాజన్న బిడ్డనే కాదని, విజయమ్మకు అక్రమ సంతానం అంటూ వ్యాఖ్యానించినప్పుడు చాలా బాధ పడ్డానని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్న కష్టాల్లో ఉంటే తన కుటుంబాన్ని వదిలి రాష్ట్రం అంతా తిరిగి 3200 కిమీలు పాదయాత్ర చేశానని, తాను బంధాలకు ఇచ్చే విలువకు అది నిదర్శనం అన్నారు.
అక్కాచెల్లెళ్ల గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదని ఫైర్ అయ్యారు. ఇలా వ్యక్తిగత దాడికి దిగేవారు మనుషులు కాదని తీవ్రంగా మండిపడ్డారు. విజయమ్మను పార్టీ నుంచి వెల్లగొట్టిన రోజే మీ పతనానికి బీజం పడిందని, ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర సమస్యలపై పోరాడే వారికే తన మద్ధతు ఉంటుందని షర్మిల స్పష్టం చేశారు.






