చంద్రబాబు చేతిలో పప్పెట్ లా షర్మిల వ్యవహారం.. మాజీమంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |

షర్మిల, చంద్రబాబు చేతిలో పప్పెట్ లా వ్యవహరిస్తున్నారని, ఆమె జగన్ తో పోటీ పడాల్సిన అవసరం లేదని మాజీమంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు.

చంద్రబాబు చేతిలో పప్పెట్ లా షర్మిల వ్యవహారం.. మాజీమంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: షర్మిల, చంద్రబాబు చేతిలో పప్పెట్ (Puppet)లా వ్యవహరిస్తున్నారని, ఆమె జగన్ తో పోటీ పడాల్సిన అవసరం లేదని మాజీమంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (YSRCP Leader Ambati Rambabu) అన్నారు. శుక్రవారం వైఎస్ఆర్సీపీ కార్యాలయం (YSRCP Party Office)లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ షర్మిలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (AP Congress Chief YS Sharmila) మాజీ సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) తో పోటీ పడాల్సిన అవసరం లేదని అన్నారు.

ఎందుకంటే, వైఎస్ఆర్ (YSR) మరణం తర్వాత చంద్రబాబు (Chandrababu) కాంగ్రెస్ పార్టీ (Congress Party)తో కలిసి చేసిన కుట్రల వల్ల జగన్ దాదాపు 16 నెలలు జైళ్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అలాంటి కాంగ్రెస్ పార్టీతో ఆమె కలిశారని మండిపడ్డారు. అలాగే తెలంగాణలో పార్టీ పెట్టి అది వదిలేసి, కాంగ్రెస్‌లో చేరి జగన్‌ మీద యుద్ధం చేస్తున్నారని, జగన్ తో ఆమెకు ఆస్తుల తగాదా ఉందో, రాజకీయ తగాదా ఉందో.. లేక చంద్రబాబుకు సాయం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు. షర్మిల చంద్రబాబు చేతిలో పప్పెట్ లా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌ (Diversion Politics) చేయాలని అనుకుంటున్నప్పుడే ఆమె బయటికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతున్నారని ఆరోపించారు.

ఆమెకు ఆస్తి తగాదాలు ఉంటే కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. అయినా పెళ్లైన 25 ఏళ్ల తర్వాత వచ్చి ఆస్తిలో సగం వాటా కావాలని అడిగితే ఎలా ఇస్తారని, చంద్రబాబు ఆయన సోదరీ మణులకు హెరిటేజ్ లో వాటా ఇస్తారా చెప్పాలని అడిగారు. అంతేగాక అన్నకు ఇష్టమైతేనో.. ప్రేమతోనో చెల్లికి వాటా ఇస్తారని, ఆయన సంపాదించుకున్న ఆస్తిలో వాటా అడగడానికి ఏం రైట్స్ ఉన్నాయని ప్రశ్నించారు. ఆమెకు ఏమైనా రైట్స్ ఉంటే కోర్టులలో తేల్చుకోవాలని అన్నారు. కానీ చంద్రబాబు రాజకీయాలకు ఉపయోగపడేందుకే, కాంగ్రెస్‌, షర్మిళమ్మ ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారని అంబటి వ్యాఖ్యానించారు.

Next Story