- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ దొంగల్లో భయం మొదలైంది.. మహా న్యూస్ ఛానల్‌పై దాడిని ఖండించిన షర్మిల
హైదరాబాద్‌లో మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్రంగా ఖండించారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్రంగా ఖండించారు. మీడియా సంస్థపై భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆమె శనివారం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
‘తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case)పై వాస్తవాలను ప్రసారం చేస్తున్న మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై BRS గూండాల దాడిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఛానల్‌లో పనిచేసే సిబ్బందిపై, ముఖ్యంగా మహిళా జర్నలిస్టుల మీద దాడి హేయమైన చర్య. ఇలాంటి దాడులు మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాయి.
నా ఫోన్ ట్యాప్ చేశారు. ట్యాప్ చేసిన ఆడియోనే వైవీ సుబ్బారెడ్డి నాకు వినిపించారు. ఉన్నమాట అంటే ఉలుకెక్కువ అన్నట్లు.. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీ దొంగ చెవులను పసిగడుతుంటే దాడులకు దిగుతారా? వాస్తవాలు చెప్పే వాళ్లను చంపాలని చూస్తారా? అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎవరి ఫోన్లనైనా ట్యాప్ చేయవచ్చా? అడిగినోళ్లకు సైతం ట్యాప్ చేసిన కాల్ రికార్డ్స్ పంపవచ్చా? దొంగతనంగా ఫోన్లు ట్యాప్ చేసి నీచానికి ఒడిగడతారా? తీగ లాగుతుంటే డొంక కదులుతుంది అన్నట్లు సిట్ విచారణలో నిజాలన్నీ బయట పడుతుంటే, ట్యాపింగ్ దొంగలకు భయం పట్టుకుంది’ అని వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్వీట్






