67 ఏళ్ల పాటు సేవలు.. కాలగర్భంలో కలిసిపోతున్న శంకర్ విలాస్ బ్రిడ్జి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-09 14:09:07  IST  )

గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జిని కూల్చివేస్తున్నారు..

67 ఏళ్ల పాటు సేవలు.. కాలగర్భంలో కలిసిపోతున్న శంకర్ విలాస్ బ్రిడ్జి
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు(Guntur)లో శంకర్ విలాస్ బ్రిడ్జి(Shankar Vilas Bridge)ని కూల్చివేస్తున్నారు. 1958లో నిర్మించిన ఈ బిడ్జి దాదాపు 67 ఏళ్లపాటు ప్రజలకు సేవలందించింది. నగరంలో పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా కొత్త బ్రిడ్జిని నిర్మించనున్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేతతో ఆ ప్రాంతంలోని రాకపోకలను మళ్లించారు. శంకర్ విలాస్ బ్రిడ్జికి రెండు వైపుల నుంచి కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఈ బ్రిడ్జితో చాలా మందికి అనుబంధం ఉంది. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు ఈ బ్రిడ్జి అనుసంధానంగా సేవలందించింది. అయితే త్వరగా కొత్త బ్రిడ్జి సేతుబంధును పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు అమరావతి రాజధాని ప్రాంతానికి ఈ రూటు నుంచే వెళ్లాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. నగర ట్రాఫిక్ దృష్ట్యా నాలుగు లైన్ల నిర్మాణం మంచిదేనని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయం చేస్తారని భావిస్తున్నామని స్థానికులు తెలిపారు.

Next Story