1.52 కోట్లు దాటిన ‘శక్తి’ యాప్‌ డౌన్‌లోడ్స్.. డీజీపీ హరీశ్ కుమార్ గుప్త

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-19 05:52:02  IST  )

మహిళల భద్రతే ధ్యేయంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవలే ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ‘శక్తి’ (Shakthi) మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

1.52 కోట్లు దాటిన ‘శక్తి’ యాప్‌ డౌన్‌లోడ్స్.. డీజీపీ హరీశ్ కుమార్ గుప్త
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళల భద్రతే ధ్యేయంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవలే ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ‘శక్తి’ (Shakthi) మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘శక్తి’ యాప్‌పై డీజీపీ హరీశ్ కుమార్ గుప్త (Harish Kumar Gupta) కీలక ప్రకటన చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు, బాలికల భద్రతకు పోలీసు శాఖ తొలి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.52 కోట్లకు పైగా ‘శక్తి’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు. హిందీ, ఇంగ్లీష‌ల్లో ‘శక్తి’ యాప్ అందుబాటులో ఉందని అన్నారు. మహిళల భద్రతకు రాష్ట్రంలో మొత్తం 164 శక్తి టీమ్స్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. మహిళలపై తరచూ నేరాలు జరిగే 900 హాట్ స్పాట్లను ఇప్పటికే గుర్తించామని తెలిపారు. శక్తి యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యతలపై 12,119 అవగాహన శిబిరాలు నిర్వహించామని తెలిపారు. మహిళాలపై హత్యాచారాలకు, హింస, లైంగిక వేధింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన డీజీపీ హరీశ్ కుమార్ గప్త స్పష్టం చేశారు.

కాగా, అత్యాధునిక ఫీచర్లతో ‘శక్తి’ యాప్‌నకు రూపకల్పన చేశారు. మహిళలు, బాలికలు ఆపద సమయంలో సాయం అందించేందుకు ఈ యాప్ కీలకంగా పని చేయనుంది. వన్ టచ్ SOS బటన్‌తో వెంటనే పోలీసులు అప్రమత్తం అవుతారు.. Shake Trigger/Hand Gesture SOS- యాప్ ఓపెన్ చేయకుండానే SOS అలర్ట్‌ను పోలీస్ డిపార్ట్‌మెంట్ పంపించ్చు. శక్తి యాప్‌తో లైవ్ ట్రాకింగ్ అండ్ ఎవిడెన్స్ షేరింగ్ కాలర్ లోకేషన్, 10 సెకన్ల ఆడియో, వీడియో కంట్రోల్ రూమ్ పంపబడుతాయి. దీంతో అప్రమత్తమై పోలీసులు క్షణాల్లో స్పాట్‌కు వెళ్లి మహిళలు, బాలికలను రక్షిస్తారు.

Next Story