వైసీపీలో చేరిన శైలజానాథ్​

by Thanuru Gopichand |

మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ వైసీపీలో చేరారు.

వైసీపీలో చేరిన శైలజానాథ్​
X

దిశ, డైనమిక్​బ్యూరో : మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ వైసీపీలో చేరారు. ఇవాళ ఉదయం ఆయన వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్​జగన్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనకు జగన్​పార్టీ కండువా కప్పి​సాదరంగా ఆహ్వానించారు. శైలజానాథ్‌తో పాటు ఏఐసీసీ మెంబర్‌, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్‌ రెడ్డి కూడా వైపీసీపీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, వైసీపీ సీనియర్‌ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి, వేంపల్లి సతీష్‌ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.విశ్వేశ్వర రెడ్డి, తలారి రంగయ్య, మేరుగ నాగార్జున, పలువురు నాయకులు పాల్గొన్నారు. గతంలో శైలజానాథ్​అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రాథమిక విద్యాశాఖ, పాఠ్యపుస్తకాలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన 2022 జనవరి 16 నుంచి 2022 నవంబర్ 23 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు

Next Story