మహిళపై లైంగిక దాడి.. నిందితుడు అరెస్ట్

by Vemula.Srinu Prasad |

అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ..

మహిళపై లైంగిక దాడి.. నిందితుడు అరెస్ట్
X

దిశ, తిరుపతి ప్రతినిధి: అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఓ మహిళకు సంబంధించిన నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయని బెదిరిస్తూ పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాక, ఈ విషయాన్ని బయటకు చెబితే ఆమెతో పాటు పిల్లలను చంపేస్తానంటూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం అర్ధరాత్రి అలిపిరి పోలీసులు క్రైమ్ నంబర్ 251/2026గా కేసు నమోదు చేశారు. అనంతరం బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో నిందితుడు గంగాధర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రేపు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం

Next Story