- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై లైంగికదాడి, హత్య
రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. మహిళలపై, బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కామంధులు రెచ్చిపోతున్నారు. ఒక ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. అభం, శుభం తెలియని చిన్నారి పై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై హత్య చేసి మృతదేహాన్ని ముళ్లపొదల్లో పడేశాడు. ఈ ఘటన ఏపీలోని కడప జిల్లా మైలవరం మండలం ఎ.కంబాలదిన్నెలో చోటుచేసుకుంది. పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన మోరగుడికి చెందిన ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నిందితుడిని తమకు అప్పగించాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో చిన్నారిని హత్య చేసిన నిందితుడిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






