- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రానికి తీవ్ర హెచ్చరిక.. ఈ మండలాలకు రెడ్ అలర్ట్ జారీ
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఉదయాన్నే భానుడు తీవ్ర ప్రభావం చూపుతున్నాడు. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే వణుకుతున్నారు. ఇక గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. మార్చి ప్రారంభం నుంచే ఎండల తీవ్రత అధికంగా నమోదవడంతో.. మే నెల నాటికి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో ఏపీలో( Andhra Pradesh) ఎండల తీవ్రత, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదవుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తాజాగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(Disaster Management Organization) హెచ్చరికలు జారీ చేసింది. గత కొద్దిరోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు(శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ తరుణంలో రాష్ట్రంలోని 89 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని.. అత్యవసరమైతే తప్ప ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో 14 మండలాలు, విజయనగరం-22, అనకాపల్లి-9, కాకినాడ-7, తూర్పుగోదావరి-8, ఏలూరు జిల్లా-5, ఎన్టీఆర్ జిల్లాలో 3 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మండుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పగటి పూట బయటకు రావొద్దని వాతావరణ అధికారులు సూచించారు.






