- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో ఈ మండలాలకు అలర్ట్.. జాగ్రత్తగా ఉండాలని APSDMA హెచ్చరిక
ఏపీలో మండుటెండలు ఠారెత్తిస్తున్నాయి. నడివేసవిలో కాచే ఎండల్ని చూస్తే.. బయటికి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వడగాలులు కూడా తీవ్రంగా వీస్తుండటంతో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మండుటెండలు ఠారెత్తిస్తున్నాయి. నడివేసవిలో కాచే ఎండల్ని చూస్తే.. బయటికి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వడగాలులు కూడా తీవ్రంగా వీస్తుండటంతో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. నేడు రాష్ట్రంలోని 19 మండలాల్లో తీవ్ర వడగాలులు (Severe Heatwaves), మరో 30 మండలాల్లో వడగాలులు (Heatwaves) వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణసంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 11 మండలాల్లో, అనకాపల్లి జిల్లాలోని 8 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరో 8 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అడ్డతీగల, అనంతగిరి, అరకు వ్యాలీ, చింతపల్లె, చింతూర్, దుంబ్రిగూడ, గూడెం కొత్తవీధి, హుకుంపేట, ముంచింగిపట్టు, పాడేరు, పెద్దబయలు మండలాల్లో.. అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం, బుచ్చయ్యపేట, చీడికాడ, చోడవరం, కశింకోట, మాడుగుల, పర్వాడ, యలమంచిలి మండలాల్లో.. 24 గంటల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.






