- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో ఐదు ప్రముఖ ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా.. సిట్ విచారణలో పెను సంచలనం
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి..

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు(Tirumala laddu adulterated ghee case)లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమలతో పాటు మరో ఐదు ప్రముఖ ఆలయాలకు బోలే బాబా డెయిరీ(Bole Baba Dairy) కల్తీ నెయ్యి సరఫరా చేశారు. ఓ చిన్న డెయిరీని అడ్డుపెట్టుకుని తిరుమల, శ్రీశైలం(Srisailam), విజయవాడ(Vijayawada), కాణిపాకం(Kanipakam), ద్వారకాతిరుమల(Dwarka Tirumala)తో పాటు శ్రీకాళహస్తి(Srikalahasti) ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారు. ఈ కల్తీ వ్యవహారంలో బోలే బాబా డెయిరీ జనరల్ మేనేజర్ హరిమోహన్ రాణా పూర్తిగా కీలక పాత్ర వహించారు. జూన్ 17న ఆయన బెయిల్ కోసం నెల్లూరు కోర్టులో ప్రయత్నం చేశారు. చిన్న చిన్న డెయిరీల ద్వారా టెండర్లు వేసి కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు సిట్ అధికారులు నిగ్గు తేల్చారు.
బోలే బాబా డెయిరీ పాల ఉత్పత్తి, సరఫరా లేకపోయినా గతంలో టీటీడీ(TTD) టెండర్లు ఎలా ఇచ్చిందనే కోణంలో సిట్ విచారణ కొనసాగిస్తోంది. దాదాపు 12 రకాల ఆయిల్స్ కలిపిన నెయ్యిని తిరుమలకు సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో 17 మందిని అరెస్ట్ చేశారు. వీరందరికి బెయిల్ ఇవ్వొద్దని సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. చిన్న, చిన్న దేవాలయాలకు కూడా బోలే బాబా డెయిరీ నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో పలువురు ఉద్యోగుల పాత్రపైనా అనుమానాలున్నాయి. ఈ కేసులో వారిని కూడా సిట్ పోలీసులు అరెస్ట్ అవకాశం ఉందని అంటున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి గత టీటీడీ చైర్మన్ పీఏ ఈ వ్యవహారాన్ని నడిపినట్లు సమాచారం. ఈ మేరకు సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం పలువురిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.






