ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇప్తార్ వింధు బహిష్కరణకు పిలుపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-26 11:34:31  IST  )

ఏపీ ప్రభుత్వానికి పలు ముస్లిం సంఘాలు బిగ్ షాక్ ఇచ్చాయి...

ప్రభుత్వానికి బిగ్ షాక్..  ఇప్తార్ వింధు బహిష్కరణకు పిలుపు
X

దివ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వానికి(AP Govt) పలు ముస్లిం సంఘాలు(Muslim communities) బిగ్ షాక్ ఇచ్చాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టబోతున్న ఇఫ్తార్ విందు(Iftar dinner)ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు ఫిబ్రవరి 19న మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లును ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముస్లిం సంఘాలన్నీ గురువారం నిర్వహించే ఇఫ్తార్‌ విందును బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అలాగే ఈనెల 29న విజయవాడ(Vijayawada) ధర్నా చౌక్‌లో చేపట్టబోయే భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభ్యులు పిలుపునిచ్చారు.

Next Story