- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనలో వేగం పెంచేందుకు, కీలక శాఖల సమన్వయం కోసం ఈ మార్పులు చేపట్టినట్లు పేర్కొంది......

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనలో వేగం పెంచేందుకు, కీలక శాఖల సమన్వయం కోసం ఈ మార్పులు చేపట్టినట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ (సీఎస్) జీవో ఆర్టీ నెంబర్ 918 ద్వారా ఆదేశాలు వెలువరించారు.
బదిలీ పూర్తి
ఈ బదిలీల్లో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశి భూషణ్ కుమార్‌ను జలవనరుల శాఖకు బదిలీ చేస్తూ పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు జలవనరుల శాఖకు అదనపు బాధ్యతలు నిర్వహించిన సీఎస్ఆర్టీ సాయి ప్రసాద్‌కు ఆ బాధ్యతల నుంచి ఉపశమనం లభించింది.
కాంతిలాల్ దండేకు అదనపు బాధ్యతలు
మరోవైపు పర్యావరణ, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాంతిలాల్ దండేకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం కేటాయించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వెనువెంటనే బాధ్యతలు స్వీకరించాలని అధికారులకు సూచించింది.






